Eto Vellipoyindhi Manasu : ఇంటిదొంగని కనిపెట్టేసిన రామలక్ష్మి.. సాక్ష్యాలతో సహా సీతాకాంత్ ముందు!
on Oct 8, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -220 లో......అందరు రామలక్ష్మి సీతాకాంత్ ని వదిలేసి వెళ్లిందని రామలక్ష్మిపై కోపంగా ఉంటారు. అప్పుడే రామలక్ష్మి వస్తుంది. గుమ్మం లో అడుగుపెడుతుంటే ఆగు అని శ్రీలత ఆపుతుంది. ఏంటి నా కొడుకు ఎక్కడికి వెళ్లొద్దని చెప్పినా కూడా ఆలా ఎలా వదిలేసి వెళ్ళావని కోప్పడుతుంది. స్వామి మీరు ఇద్దరు ఇంట్లో నుండి వెళ్ళకని చెప్పినా కూడా నువ్వెందుకు ఇలా చేసావని అడుగుతుంది.
నా సీతకీ ఏమైనా అయితే నేను తట్టుకోలేనని తెలుసు.. అయిన ఎందుకు వదిలి పెట్టి వెళ్ళావని శ్రీలత యాక్టింగ్ చేస్తుంది. అసలేం జరిగిందో చెప్పకుండా ఎందుకు ఇలా చేస్తున్నారని రామలక్ష్మి అంటుంది. బావ గారు జారీ పడ్డారని శ్రీవల్లి చెప్తుంది. దాంతో రామలక్ష్మి రాబోతుంటే ఆగమని శ్రీలత ఆపుతుంది. ఈ నటనే వద్దంటున్నారు.. అంత ప్రేమ ఉంటే అసలు తనని వదిలి వెళ్లి ఉండేదానివి కాదని.. శ్రీలత అంటుంది. స్వామి వద్దని చెప్పిన కానీ ఎందుకు వెళ్ళావ్ వదిన అంటూ సందీప్ అంటాడు. పెద్దాయన కూడా రామలక్ష్మినే అంటాడు. ఎందుకు వదిలేసావ్ వదిన అంటూ సిరి కోప్పడుతుంది. నాకు ఏదో అవుతుందని భయం లేదు.. నాకు మాట ఇచ్చి ఇలా చేసావ్.. నేను అంటే ఇష్టం లేదనే కదా అని సీతాకాంత్ అంటాడు. నీకు వెళ్ళాలి అనిపిస్తే నాకు ఒక మాట చెప్పాలి కదా అని సీతాకాంత్ అంటాడు. నేనేం చేసిన దానికి కారణం ఉంటుందని రామలక్ష్మి అనగానే.. ఆ కారణం చెప్పు ఎందుకు వెళ్ళావని శ్రీలత అంటుంది. ఏదో తప్పు చేసి ఉంటుందని శ్రీవల్లి అనగానే.. తప్పు చేయాల్సిన అవసరం లేదని రామలక్ష్మి అంటుంది. ఇక నువ్వెవరో.. మేమ్ ఎవరో.. వెళ్ళు ఇక్కడ నుండి అని శ్రీలత అంటుంది. ఎవరు బయటకు వెళ్లాలో ఇప్పుడు చెప్తానంటూ రామలక్ష్మి లోపలికి వస్తుంది. వద్దన్నా కూడా ఎందుకు వస్తున్నావని శ్రీలత అంటుంది. ఆవేశ పడకండి అని రామలక్ష్మి సీతకాంత్ కి నిజం చెప్తుంది.
ఆ రోజు సిరి నగలు దొంగతనం చెయ్యాలి అనుకున్నవాడు నన్ను చంపాలని వచ్చాడు.. నేను కాదని తెలిసి సిరి నగలు అని ప్లాన్ చేసాడు. మీరు పట్టుకోబోతుంటే మిమ్మల్ని నెట్టాడు.. ఇదంతా ఈ సందీప్ చేసాడు.. అనగానే అందరూ షాక్ అవుతారు. శ్రీలత సందీప్ లు అలా ఎందుకు మాట్లాడుతున్నావని అంటారు. ఇదిగో అంటూ రౌడీ సందీప్ గురించి చెప్పిన వీడియోని చూపిస్తుంది . వీడే ఆ రౌడీ నేను చూసిందని సిరి అంటుంది. అది చూసి సందీప్ ని కొడతాడు సీతాకాంత్. ఇంకా రౌడీ ఆఫీస్ కీ వెళ్లిన వీడియోని కూడా రామలక్ష్మి చూపిస్తుంది. అలా నమ్మను.. ఆ రౌడీ వచ్చి చెప్తేనే నమ్ముతానని సందీప్ అంటాడు. దాంతో మాణిక్యానికి ఫోన్ చేసి రౌడీ ని తీసుకొని రమ్మని రామలక్ష్మి చెప్పగానే.. మాణిక్యం తీసుకొని వస్తాడు. సందీపే ఇదంతా చేసాడని రౌడీ అనగానే.. అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read